హిట్‌ అండ్‌ రన్‌: ఇద్దరు వలస కూలీలు మృతి

  • మరొకరికి తీవ్ర గాయాలు

అంబాలా/రాయ్‌బరేలీ: యూపీ, హర్యానాలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వలసకూలీలు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై నడుస్తున్న కూలీలపైకి కారు దూసుకుపోయిందని అధికారులు చెప్పారు. బీహార్‌‌కు చెందిన ఇద్దరు కూలీలు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు నడుస్తుండగా.. అంబాలా దగ్గర వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. మరొకరికి తీవ్రంగా గాయాలుకావడంతో హాస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. వేగంగా వచ్చిన ఎస్‌యూవీ కారు అదుపుతప్పి నడుస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. ఘటనకు సంబంధించి కారు సీజ్‌ చేశామని, డ్రైవర్‌‌ పరారీలో ఉన్నాడని అన్నారు. యూపీలోని రాయ్‌బరేలీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వలస కూలీ చనిపోయినట్లు అధికారులు చెప్పారు. సైకిల్‌పైన వెళ్తున్న కూలీని కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Latest Updates