రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 11మంది మృతి

రాజస్థాన్ నాగూర్ జిల్లా కుచమాన్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11మంది మృతి చెందారు. శనివారం పొద్దున 3గంటలకు రెండు మినీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో 11మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కు చేర్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పారు పోలీసులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Latest Updates