రెండు మిని ఫ్లైట్స్ ఢీ.. స్పాట్లోనే అందరూ మృతి

రెండు చిన్న విమానాలు ఢీకొని ఏడుగురు మృతి చెందిన ఘటన అలస్కాలోని యాంకరేజ్ లో జరిగింది. ఈ ప్రమాదంలో అలస్కాకు చెందిన శాసనసభ్యుడొకరు మరణించారు. కెనాయి ద్వీపకల్పంలోని సోల్డోట్నా విమానాశ్రయానికి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో రెండు విమానాలలోని వ్యక్తులెవరూ ప్రాణాలతో బయటపడలేదని అలస్కా స్టేట్ ట్రూపర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రమాదంలో అలస్కాలోని యాంకరేజ్ కు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న గ్యారీ నాప్ కూడా మరణించారు. ఒక విమానంలో గ్యారీ నాప్ మాత్రమే ఉన్నారు. ఆయనే స్వయంగా విమానాన్ని నడుపుతున్నారు. మరో విమానంలో నలుగురు టూరిస్టులు, ఒక గైడ్, ఒక పైలట్ ఉన్నారు. వీరంతా ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. విమానాల శకలాలు కొన్ని హైవేపై పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో ఆ రహదారిని భద్రతా దళాలు మూసివేశాయి. ఈ విమానాలలో ఒకదాన్ని డీ-హవిలాండ్ డిహెచ్‌సి -2 బీవర్‌గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. ఈ ప్రమాదంపై ఎఫ్‌ఏఏ, జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తున్నాయి.

‘గ్యారీ నాప్ విమాన ప్రమాదంలో చనిపోయాడని తెలిసి నేను షాక్ అయ్యాను. గ్యారీ ఒక రకమైన నాయకుడు మరియు నిజమైన అలస్కాన్. శాసనసభలో తన జిల్లా కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. అతన్ని చాలా మంది మిస్సవుతారు’ అని హౌస్ స్పీకర్ బ్రైస్ ఎడ్గ్మోన్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్యారీ మృతి పట్ల స్టేట్ హౌస్ సభ్యులు సంతాపం తెలిపారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన మిగతావారిని పైలట్ గ్రెగొరీ బెల్ (67), గైడ్ డేవిడ్ రోజర్స్ (40), మరియు టూరిస్టులు కాలేబ్ హల్సే (26), హీథర్ హల్సీ (25), మాకే హల్సీ (24), మరియు కిర్స్టిన్ రైట్ (23) లుగా గుర్తించారు.

For More News..

మంత్రులు మాట్లాడుకోలే.. సక్సెస్ కాని కేసీఆర్ ప్లాన్

‘సింగరేణి’లో కరోనాతో చనిపోతే రూ.15లక్షల పరిహారం

అయోధ్య భూమి పూజకు 1,11,000 లడ్డూలు

Latest Updates