అక్కాచెల్లెళ్లపై ఎనిమిది మంది అత్యాచారం

బాయ్ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లొస్తుండగా ఘటన
బాలికలిద్దరూ మైనర్లు.. నిందితులలో కూడా ముగ్గురు మైనర్లు

చత్తీస్ ఘర్ లో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లను ఎనిమిది మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 31న జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులను అరెస్టు చేసినట్లు బలోదాబజార్ పోలీసు సూపరింటెండెంట్ ఇందిరా కల్యాణ్ ఎలిసెలా తెలిపారు. ఎనిమిది మందిలో ఐదుగురు నిందితులు మేజర్లని మరియు మరో ముగ్గురు మైనర్లని ఎస్పీ తెలిపారు.

‘నిందితులైన అరెస్టు చేసి రిమాండ్ పంపాం. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. మైనర్లను అదుపులోకి తీసుకొని జువైనల్ హోం కు తరలించాం. బాలికలపై.. వీరే కాకుండా మరో ముగ్గురు కూడా అత్యాచారం చేసినట్లు తేలింది. దాంతో వారిని కూడా అరెస్టు చేశాం. బాధితులలో ఒకరు బుధవారం సాయంత్రం మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖకు చేరుకొని తనపై రెండు నెలల క్రితం ఎనిమిది అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. అప్పటి అత్యాచార ఘటన వీడియోను ఆసరగా చేసుకొని.. మళ్లీ ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆ బాలిక తండ్రి ఫిర్యాదులో తెలిపాడు’ అని ఎస్పీ తెలిపారు.

ఈ ఇద్దరు అమ్మాయిలకు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఎస్పీ తెలిపారు. సంఘటన జరిగిన రోజు.. బాలికలు వారి బాయ్ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. బాలికలతో వెళ్లిన బాయ్ ఫ్రెండ్స్ పై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

For More News..

టిక్ టాక్ బ్యాన్ చేసే ఆలోచనలో డోనాల్డ్ ట్రంప్

వీడియో: ఆవు మాంసం తరలిస్తున్నాడని.. తల మీద సుత్తితో కొట్టి..

రెండు మిని ఫ్లైట్స్ ఢీ.. స్పాట్లోనే అందరూ మృతి

Latest Updates