వర్షాలకు బషీర్ బాగ్ బస్తీలో కూలిన రెండు ఇళ్లు

తప్పిన ప్రాణాపాయం

హైదరాబాద్:  కురుస్తున్న భారీ వర్షాలకు బషీర్ బాగ్ స్కైలెన్ ధియేటర్ లైన్ లోని ఓల్డ్ కామేల బస్తీలో  రెండు ఇల్లులు కూలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వర్షాలకు ఇల్లులు కూలిపోవడంతో అదే వీదిలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను జిహెచ్ఎంసి అధికారులు జేసిబి సాయంతో కూల్చివేశారు. ఇల్లు కూలిపోయి నిరాశ్రయులుగా మారిన తమని ప్రభుత్వం గానీ, అధికారులు కానీ పట్టించుకోవడంలేదని బాధితులు వాపోయారు. ఉండడానికి ఉన్న నీడ కూడా కోల్పోయి రోడ్డున పడ్డామని.. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Latest Updates