ఎంబిబిఎస్ సిలబస్ లో కొత్తగా 2 సబ్జెక్టులు

Two news subjects in MBBS syllabus: Medical council of india

ఎంబీబీఎస్ స్టడీలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దాదాపు 20 ఏళ్లుగా ఒకే పద్దతిలో కొనసాగిన ఎంబిబిఎస్ సిలబస్ లో … 2 సబ్జెక్టులు కొత్తగా చేర్చారు. రెండేళ్ల పాటు సిలబస్ లో మార్పులపై  సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంది.

వైద్య విద్యలో కీలక మార్పులు చేసింది ఎంసీఐ. విద్యార్ధుల సిలబల్ లో రెండు కొత్త సబ్జెక్ట్ లు చేర్చింది. డాక్టర్ వృత్తిపై వస్తున్న ఆరోపణలపై ఎంసీఐ ఈ కీలక నిర్ణయాలు తీసుకంది. చాలా మంది డాక్టర్లు కమర్షియల్ గా మారడంతో పాటు పేషెంట్లను సరిగా చూడడం లేదనే వస్తున్న విమర్శలు వచ్చాయి. దీంతో 2017లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా .. ఓ కమిటీ వేసి వైద్య విద్యలో మార్పులు తీసుకొచ్చే అంశంపై చర్చించింది. దీంట్లో ప్రధానంగా నైతికత, కమ్యూనికేషన్స్ లాంటి అంశాలపై, కమిటీ సభ్యుల సిఫారసులతో.. MCI కీలక నిర్ణయాలు తీసుకుంది.

కొన్నేళ్లుగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెరగడం, లక్షల రూపాయలు పెట్టి చదవడంతో డాక్టర్లంతా డబ్బు సంపాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అవసరం లేకున్నా సర్జరీలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఎంసిఐ మార్పులు చేయడంతో మెడికల్ విద్యార్ధులకు ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త రూల్ ప్రకారం మొదటి సంవత్సరం నుంచే ఆస్పత్రికి వెళ్లి సీనియర్ డాక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకునే అవకాశం వచ్చింది. గతంలో ఏడాదిన్నర పాటు ఆగాల్సి వుండేది. ఇక నుంచి ఎంబీబీఎస్ స్టడీ ఫస్ట్ ఈయర్ 14 నెలలు చదవాలి. సెకండ్ ఈయర్ 12 నెలలకి కుదించారు. థర్డ్ ఈయర్ గతంలో మాదిరిగానే 12 నెలల పాటు కంటిన్యూ చేయనున్నారు. నాల్గో సంవత్సరాన్ని 13 నెలల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎంసిఐ. కొత్తగా కమ్యూనిటీ మెడిసిన్, క్లినికల్ సబ్జక్టుల పరిచయంతో పాటు..మోరల్ వ్యాల్యూస్, ఎథిక్స్ లక్ష్యంగా సిలబస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంపై సీనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎంసిఐ తీసుకున్నకీలక నిర్ణయాలు ప్రాథమిక స్ధాయిలో మెడికల్ స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. పీజీ లోనూ ఇదే తరహా విధాలు అమలు చేయాలంటున్నారు.  -డా. శ్రీనివాస్, జుడా అధ్యక్షుడు, నిమ్స్ హాస్పిటల్