ఏపీలో వేర్వేరు చోట్ల రెండు ఆయిల్ ట్యాంకర్లు బోల్తా

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. రోడ్డుపాలైన ఆయిల్
విజయవాడ: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో.. కొన్ని గంటల తేడాలో రెండు ఆయిల్ ట్యాంకర్లు బోల్తాపడ్డాయి. రెండు చోట్లా కొద్ది తేడాలో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్లలోని పెట్రోల్..ఆయిల్ మాత్రం రోడ్డు పాలైంది. గన్నవరం దగ్గర లీక్ అవుతున్న ట్యాంకర్ నుండి జనం పెద్ద ఎత్తున వచ్చి బకెట్లలో పెట్రోల్ నింపుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెండు చోట్ల ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం ఆత్కూరు గ్రామం వద్ద గన్నవరం జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. కరెంటు ట్రాన్స్ ఫార్మర్ కు అతి సమీపంలో ట్యాంకర్ బోల్తాపడడం స్థానికులను ఒకింత భయాందోళనకు గురిచేసింది. అయితే ప్రమాదం ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒరిగిపోయిన ట్యాంకర్ మూతల నుండి పెట్రలో కారిపోతుండడం గుర్తించిన స్థానికులు.. బాటిళ్లు.. బకెట్లు.. బిందెలుతీసుకొచ్చి మరీ పెట్రోల్ నింపుకున్నారు.  పెట్రోల్ పట్టుకునేందుకు వస్తున్న జనం. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందిని రప్పించి ముందస్తు చర్యలు చేపట్టారు. ట్యాంకర్ ను క్రేన్ల సహాయంతో పైకి లేపి కూర్చోబెట్టే పనులు ప్రారంభించారు.

ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తేడాలో కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో మరో ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి హుటాహుటిన డ్రైవర్ను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . ట్రాన్స్ ఫార్మర్ పక్కనే క్షణాల్లో ఒరిగిపోయింది. బస్టాప్ లో అందరూ చూస్తుండగా జరిగిన ఘటన భయాందోళన రేపింది. ట్యాంకర్ నుండి ఆయిల్ లీకై వృధాగా రోడ్డుపాలైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రోడ్డుపై ఆయిల్ పడడంతో రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

Latest Updates