వీడియో: ఆవు వెంటబడి తరిమితే.. హెలికాప్టర్‌‌తో కాపాడిన్రు

శాన్ ఫ్రాన్సిస్కో లో వృద్ధజంటకు షాకింగ్ ఎక్స్ పీరియన్స్

శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పార్క్ లో వాకింగ్ కు వెళ్లిన ఓ వృద్ధజంటకు షాకింగ్ ఎక్స్ పీరియన్స్ ఎదురైంది. లించ్ కాన్యన్ రీజినల్ పార్క్ దగ్గర ఓ ఆవు, దాని దూడ రెండూ కలిసి వారి వెంటపడ్డాయి. రెండూ కలిసి తరుముతూ, వెనక నుంచి పొడవడంతో వారిద్దరూ కిందపడ్డారు . దీంతో వాళ్లకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అయినా కూడా ఆవు, దూడ వదల్లేదు. కాస్త దూరంలో నిల్చుని, వాళ్లనే సీరియస్గా చూస్తున్నాయి. లేచి నిలబడితే అవి రెండూ మళ్లీదాడిచేసేలా ఉండడంతో ఆ ముసలాళ్లు ఇద్దరూ చాలాసేపు కదలకుండా ఉన్నారు. తమను కాపాడాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడంతో కాలిఫోర్నియా పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. సంఘటనా స్థలాన్ని గుర్తించి, హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు. ఆ దంపతులను తాళ్లతో కట్టి, హెలికాప్టర్ తో అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిదించారు. ఇదంతా జరుగుతున్న టైంలో కూడా ఆ ఆవు, దాని దూడ వారిని సీరియస్గా చూస్తూ ఉండడం పోలీసులను కూడా షాక్ కు గురిచేసింది. ఈ రెస్క్యూ తతంగాన్నంతా పోలీసులు వీడియో తీసి ఫేస్ బుక్లో పోస్ట్ చేయడంతో.. ఈ వీడియో వైరల్ గా మారింది. ఆవు ఇలా పగబట్టినట్లు వారిపై దాడి చేయడమేంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates