హేమంత్ హత్య కేసు: సందీప్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందన్న అవంతి

 

సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్యకేసులో రోజుకో ట్విస్ట్ బ‌య‌ట‌ప‌డుతుంది. అవంతి మేనమామ యుగేంధర్‌రెడ్డే ఆమె భర్త హేమంత్‌ కిడ్నాప్‌, హత్యకు సూత్రధారి అని పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ హత్యకేసులో పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18 మంది నిందితుల్లో మరో ఇద్దరు నిందితులు జగన్‌, సయ్యద్‌ పరారీలో ఉన్నారు. అయితే తాజాగా మరో ట్విస్ట్‌ను అవంతి బయపెట్టారు.

హేమంత్ కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అవంతి ఆరోపిస్తున్నారు. సందీప్‌రెడ్డి గూడూరు, ఆశిష్‌రెడ్డి ప్రమేయం ఉందని పేర్లతో సహా ఆమె చెబుతున్నారు. నెల రోజుల కిందట తన దగ్గర నుంచి రెండు లక్షలు అప్పు తీసుకున్నారంటూ హేమంత్ తండ్రితో సందీప్ రెడ్డి బెదిరింపులకు దిగాడని తెలిపారు. హేమంత్ కిడ్నాప్ అయిన రోజే సందీప్‌ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సందీప్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని అవంతి మీడియాకు తెలిపారు.

 

Latest Updates