వీడియో: ఒకే క్రీజులోకి పరుగు తీసిన ఇద్దరు బ్యాట్‌మెన్స్.. ఒకరు అవుట్..

పాకిస్తాన్, జింబాబ్వేల మధ్య ప్రస్తుతం మూడు వన్డేలు, ఒక టీ20 సిరీస్ జరుగుతున్నాయి. శుక్రవారం రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఒక వింతైన రన్ అవుట్ జరిగింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. జింబాబ్వే బౌలర్ రజా వేసిన 26వ ఓవర్లో ఇమామ్-ఉల్-హక్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు. రజా వేసిన బంతిని కొట్టిన ఇమామ్.. అవతలి ఎండ్‌లో ఉన్న సోహైల్‌ను సింగిల్ కోసం రావాలని కోరాడు. దాంతో సోహైల్ సింగిల్ కోసం వెళ్లాడు. అయితే బంతి ఫీల్డర్ చేతిలో పడటంతో.. ఇమామ్ వెంటనే తన ప్రయత్నాన్ని ఉపసంహరించుకొని వెనుదిరిగాడు. కానీ, అప్పటికే సోహైల్.. ఇమామ్ క్రీజ్ దగ్గర్లోకి చేరుకున్నాడు. దాంతో ఇద్దరు బ్యాట్‌మెన్లు ఒకే క్రీజు వైపు పరుగుతీశారు. బంతిని అందుకున్న ఫీల్డర్.. వెంటనే బాల్‌ను బౌలర్‌కు అందించాడు. బౌలర్ వెంటనే బంతిని వికెట్లకు కొట్టాడు. అప్పటికే సోహైల్ అపోజిట్ క్రీజును చేరుకోవడంతో ఇమామ్ అవుట్‌గా వెనుదిరిగాడు.

For More News..

వీడియో: స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్‌కు నివాళులు అర్పించిన ప్రధాని

రాష్ట్రంలో కొత్తగా 1,445 కరోనా కేసులు

టీ20ల్లో వెయ్యి సిక్సర్లు కొట్టిన ఫస్ట్‌‌ క్రికెటర్

Latest Updates