వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపూర్, మడికొండ జాతీయ రహదారి పై  రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దర వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వేగంతో వస్తున్న లారీలు ఒక్కసారిగా ఢీకొనడంతో.. ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. మరణించిన వారిలో పాలకుర్తికి చెందిన గుంజ రాజు(34), చర్బౌలికి చెందిన MD.మినహజ్ బాబా(24) ఉన్నారు. మరొ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని వరంగల్ లోని ఎం.జి.ఎం ఆసుపత్రికి  తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest Updates