బెంగాల్ లో బాంబు దాడి..ఇద్దరు మృతి

పశ్చిమ బెంగాల్ లో ఘర్షణలు తగ్గడం లేదు. ఇప్పటికే బీజేపీ,టీఎంసీ వర్గాల ఘర్షణలో పలువురు చనిపోగా..లేటెస్ట్ గా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కంకినార ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి బాంబు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు చనిపోగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. బాంబు దాడి అనంతరం దుండగులు చోరీ చేసినట్లు చెబుతున్నారు అక్కడి స్థానికులు. ఘటన అనంతరం అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.

Latest Updates