పీకలదాకా తాగి..బీరు బాటిళ్లతో కొట్టుకున్నారు

పీకలదాకా తాగారు. తలలు పగిలేలా తన్నుకున్నారు. బీరు బాటిళ్లతో రక్తాలొచ్చేలా కొట్టుకున్నారు. హైదరాబాద్… సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక శివగంగ వైన్స్ లో ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి దాడికి పాల్పడిన వ్యక్తి పరారయ్యాడు. వైన్స్ నిర్వాహకుల సమాచారంలో.. స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు.

 

Latest Updates