సీసీటీవీ ఫుటేజ్: అబిడ్స్‌లో ఆక్సిడెంట్.. క్షణాల్లో గాలిలో కలిసిన ప్రాణాలు

రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఇద్దరు ప్రాణాలను బలిగొన్నది. ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా బండి నడపడం వల్ల ఎదురుగా వచ్చిన బండిని ఢీకొట్టడంతో ఇద్దరూ మృతిచెందిన ఘటన అబిడ్స్‌లో మంగళవారం రాత్రి జరిగింది. అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్‌కు దగ్గర్లోని కృపా టిఫిన్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి టిఫిన్ చేసి బైక్‌తో నిర్లక్ష్యంగా రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. దాంతో ఎదురుగా వచ్చిన వ్యక్తి బండి మీది నుంచి ఎగిరిపడ్డాడు. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా.. బండిని నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటన అంతా పక్కనే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

రాష్ట్రంలో మరో 2,296 కరోనా పాజిటివ్ కేసులు

అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఎల్ఆర్ఎస్ ఫీజులు

నీటిని తరలించేందుకు స్పీడ్ పెంచిన ఏపీ

Latest Updates