బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి

సిద్దిపేట: ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం ఉదయం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం జాలిగామ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా… మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

Latest Updates