అమెరికాలో రెండు పిల్లులకు కరోనా

న్యూయార్క్: అమెరికాలో రెండు పెంపుడు పిల్లులకు కరోనా సోకింది. న్యూయార్క్ లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉండే రెండు పిల్లులకు కరోనా పాజిటివ్ వచ్చిందని హెల్త్ అథారిటీస్ స్పష్టం చేశాయి. యూఎస్ లో కరోనా వచ్చిన ఫస్ట్ పెట్స్ ఇవే అని యూఎస్ డిసీస్ కంట్రోల్ ప్రివెన్షన్ (సీడీసీ), యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్​ అగ్రికల్చర్స్ (యూఎస్ డీఏ), నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లేబొరేటరీస్ తెలిపాయి. ఈ క్యాట్స్ త్వరలోనే కోలుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. పెంపుడు జంతువులను బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు, ఇతర యానిమల్స్ తో కలవకుండా జాగ్రత్త పడాలని పెట్స్ యజమానులకు సీడీసీ సూచించింది. పిల్లులను ఇంట్లోనే ఉంచాలని చెప్పింది. జన సమూహాల వద్ద పెంపుడు జంతువుల యజమానులు క్లాత్ తో తమ ముఖాన్ని కవర్ చేసుకోవాలని పేర్కొంది. పెట్స్ తో ఇంటరాక్షన్ తర్వాత వారు తమ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన జంతువుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. కరోనా పేషెంట్లతో కాంటాక్ట్​ఉన్న యానిమల్స్ కే కరోనా పాజిటివ్ గా వస్తోంది.

Latest Updates