కరోనా ఎఫెక్ట్: రెండు పోలీస్ స్టేషన్ల మూత

కోయంబత్తూర్: ఆరుగురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో తమిళనాడు కోయంబత్తూర్ లోని రెండు పోలీస్ స్టేషన్లను టెంపరరీగా మూసివేశారు. పోడానూర్, కునియముతూర్ ప్రాంతాలలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ల సిబ్బందిని స్థానిక ఫంక్షన్ హాల్​లోకి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన ఆరుగురు స్థానిక ఈఎస్ఐ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతున్నారని తెలిపారు. మిగతా సిబ్బంది నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపించగా 105 మందికి నెగిటివ్ వచ్చిందని పోలీస్ కమిషనర్ సుమిత్ శరన్ తెలిపారు. తమిళనాడులో ఇప్పటికే 1,755 మందికి వైరస్ సోకగా.. 22 మంది చనిపోయారు.

Latest Updates