రెండు RTC బస్సులు ఢీ: డ్రైవర్ మృతి

రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లం పాడు వద్ద జరిగింది. తెలంగాణ ఖమ్మం, ఆంధ్ర ప్రదేశ్ ఏలూరు డిపోలకు చెందిన బస్సులు రెండు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.  ఈ ఘటనలో ఏలూరుకు చెందిన బస్ డ్రైవర్ కిరణ్ మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.  ఏలూరు డిపోకు చెందిన బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తుంది. ఖమ్మం డిపోకు చెందిన బస్సు సూర్యపేట్ నుంచి ఖమ్మం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కేసేను నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Latest Updates