
ఫస్ట్‌ఫేజ్‌లో రెండు స్కైవేలు
రూ.60 కోట్లతో ఉప్పల్, మెహిదీపట్నంలో ఏర్పాటు
వారం రోజుల్లో పనులు చేపట్టనున్న హెచ్ఎండీఏ
హైదరాబాద్, వెలుగు: సిటీలో హెచ్ఎండీఏ స్కైవే లను నిర్మిస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా వారం రోజుల్లో ఉప్పల్, మెహిదీపట్నంలో పనులను చేపట్టనుంది. రోడ్ యాక్సిడెంట్స్, వాకర్స్ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రెండేళ్ల క్రితం డీపీఆర్(డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు)ను రూపొందించారు. తాజాగా అధికారులు అమలు పరుస్తున్నారు. దాదాపు రూ. 60 కోట్ల వ్యయంతో ఉప్పల్, మెహిదీపట్నంలో స్కై వేలను నిర్మించనున్నారు. సెకండ్ ఫేజ్ లో దిల్ సుఖ్ నగర్, ఎల్ బీనగర్, సికింద్రాబాద్, ఐటీ కారిడార్ లోని రద్దీ ప్రాంతాల్లో నిర్మిస్తామని హెచ్ఎండీఏ వర్గాలు చెప్తున్నాయి. పెడెస్ట్రియన్ పాత్స్ లో ఈజీ, సేఫ్టీగా ఉండేలా హెచ్ఎండీఏ స్కేవేలను ప్లాన్ చేసింది. మెయిన్ జంక్షన్ల వద్ద ఎత్తైన స్కైవేలను ఏర్పాటు చేయనుంది. వాటి పక్కనే షాపింగ్ చేసుకునేలా కమర్షియల్ స్టాల్ అందుబాటులోకి తీసుకురానుంది.
రద్దీ ప్రాంతాలకు ఇంపార్టెన్స్
వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉండే మెహిదీపట్నం, ఉప్పల్ రింగ్ రోడ్డు జంక్షన్ల వద్ద స్కైవాక్ లను నిర్మించే దిశగా హెచ్ఎండీఏ ప్లానింగ్ రూపొందించింది. రూ.35 కోట్లతో రామంతాపూర్, ఉప్పల్, తార్నాక, ఎల్ బీనగర్ రూట్స్ ను కలుపుతూ సర్క్యూట్ తరహాలో నిర్మించనుంది. ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా వేగంగా సాగుతాయని అధికారులు తెలిపారు. గుడిమల్కాపూర్‌కు వెళ్లే చౌరస్తా నుంచి మెహిదీపట్నం బస్టాండ్ మీదుగా పీవీ ఎక్స్‌ప్రెస్ వే ఫ్లై ఓవర్ కింద నుంచి మిలిటరీ స్థలం వైపు ఉన్న బస్టాండ్ వరకు ఈ స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో పాటు రైతుబజార్ నుంచి మెహిదీపట్నం బస్టాండ్ వరకు మరో స్కైవాక్‌ను కూడా లింక్ చేసేలా రూ. 25 కోట్లతో నిర్మిస్తున్నారు.
For More News..