కూకట్ పల్లిలో రోడ్డుపై కొట్టుకున్న స్టూడెంట్స్

హైదరాబాద్ కూకట్ పల్లిలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. రెండు స్టూడెంట్స్ గ్రూపులు.. రోడ్డుపైనే పరస్పర దాడులకు దిగారు. కర్రలు, రాళ్లతో విద్యార్థులు.. దాడులకు దిగారు. ఫార్చ్యూన్ విద్యాసంస్థల.. స్టూడెంట్స్ గా పోలీసులు గుర్తించారు. విద్యార్థుల గొడవలో.. ఓ మహిళకు గాయాలయ్యాయి. రోడ్డుపై విద్యార్థులు సడన్ గా దాడులకు దిగటంతో.. చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏం జరుగుతుందో తెలియక.. పరుగులు తీశారు. స్టూడెంట్స్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. రోడ్డుపైనే కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.

Latest Updates