పురుగుల మందు తాగి ఇద్దరు విద్యార్థులు మృతి

సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. పురుగుల మందు తాగి ఇద్దరు స్టూడెంట్లు మృతిచెందారు.  మద్దూరు మండలంలోని నర్సాయపల్లి శివారు పల్లె పిట్టలగూడెంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన  జరిగింది . పిట్టలగూడెంలోని తుమ్మల రమేష్​ కుమారుడు తుమ్మల భాస్కర్(12), కాలియా తిమ్మయ్య కుమారుడు బన్నీ(11) నర్సాయపల్లిలోని ప్రైమరీ స్కూల్​లో చదువుతున్నారు.

బడి విడిచిపెట్టిన అనంతరం ఇంటికి వస్తూ శివారుపల్లెలోని చేనులో కనిపించిన పురుగులమందు తాగారు.ఇంటికి రాగానే నురుగులు కక్కుతూ సొమ్మసిల్లి పడిపోయారు. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఇద్దరిని హుటాహుటిన చేర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్​లో భాస్కర్ చనిపోయాడు. అపస్మారక స్థితిలోఉన్న బన్నీని సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న చేర్యాల సీఐ రఘు, ఎస్సై మోహన్ బాబు ఆసుపత్రికి వచ్చి పరిశీలించారు. తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అసలు పురుగుల మందు ఎందుకు తాగారన్నవిషయంపై విచారణ చేస్తున్నారు.

Latest Updates