చదువుకుంటానని ఒకరు..పేరెంట్స్‌ తిట్టారని మరొకరు..

ఎల్ బీ నగర్,వెలుగు: చదువుకుంటానని చెప్పి వెళ్లి గదిలోని వెళ్లిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం..మన్సూరాబాద్ శ్రీరామ హిల్స్ కాలనీలో ఉండే మల్లం రాజయ్య,పుష్ప దంపతుల పెద్ద కూతురు సృజన(21) నిజాం కాలేజీలో ఎమ్మెస్సీ ఫైనలియర్ చదువుతోంది. ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటంతో రోజులాగే బుధవారం తెల్లవారుజామున లేచి చదువుకునేందుకు రూమ్ లోకి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత తల్లి పుష్ప వెళ్లి చూడగా సృజన చున్నీతో ఉరేసుకుని కనిపించింది. పోలీసులు సృజన ఆత్మహత్యకు కారణాలు దర్యాప్తులో తెలుస్తాయన్నారు.

అల్వాల్‌‌లో

ఇంటర్​మీడియట్ లో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించినందుకు మనస్తాపంతో ఓ విద్యార్థిని ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ ఎస్‌ఐ వరప్రసాద్ కథనం ప్రకారం భీమవరంకు చెందిన సత్యనారాయణ కుటుంబంతో కలిసి అల్వాల్ ఫాదర్ బాలయ్య నగర్ లో ఉంటున్నాడు. ఈయన వాచ్​మెన్. సత్యనారాయణ కూతురు రామలక్ష్మి(17) భీమవరంలో ఇంటర్మీడియట్ ఫస్ట్​ఇయర్​పూర్తి చేసింది. అయితే ఇటీవల విడుదలైన ఫలితాలలో మార్కులు తక్కువ వచ్చాయని తల్లిదండ్రులు మందలించినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన ఆమె బుధవారం వాళ్లు ఉండే భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates