సస్పెక్టెడ్ టెర్రరిస్టులు: యూపీలో ఇద్దరు అరెస్ట్

జైషే మహమ్మద్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరిని ఉత్తర ప్రదేశ్ లో పట్టుకున్నారు ఏటీఎస్ పోలీసులు. ఇంటెలిజెన్స్ సమాచారంతో అలెర్ట్ అయిన ఏటీఎస్.. రాష్ట్ర వ్యాప్తంగా తనికీలు చేపట్టారు. దీంతో గురువారం పక్కా సమాచారంతో ఇద్దరు జైషే మహమ్మద్ తీవ్రవాదులను అరెస్టు చేశారు. ఈ ఇద్దరు జైషే ఉగ్ర సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు యూపీ డీజీపీ ఓపీ సింగ్. గురువారం వీరిని అరెస్టు చేయాగా…  శుక్రవారం మీడియాకు వెళ్లడించారు యూపీ డీజీపీ.

“జైషే మహమ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గురువారం పట్టుకున్నాం. అరెస్టు అయిన వారు.. షానావాజ్ అహ్మద్ తెలి, అఖిబ్ అహ్మద్ మాలిక్. వీరిలో అఖిబ్ కశ్మీర్ పుల్వామా కు చెందిన అతను. షానవాజ్ సొంత ఊరు కుల్గాం. వీరి నుండి రెండు తుపాకులను, బుల్లెట్లను స్వాధీనం చెసుకున్నాం ” అని యూపీ డీజీపీ చెప్పారు.  శుక్రవారం వీరిని శహారన్ పూర్ కోర్టులో ప్రవేశపెట్టగా… రెండురోజుల విచారణకు ఏటీఎస్ టీంకు అప్పగించింది.

Latest Updates