రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని స్కూటీతో ఢీకొట్టి ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను బిహార్ కు చెందిన వారిగా గుర్తించారు. వీరు హైదరాబాద్ లోనే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే  నిన్న బీదర్ లో జరిగిన ఫంక్షన్ కి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

బైక్ లారీ కిందకు దూసుకుపోవడంతో మృతదేహాలను బయటకు తీయడం కష్టంగా మారింది. గ్యాస్ కటర్లను ఉపయోగించి వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

see also: సరోగసి కాదు.. సహజీవనం చేద్దమన్నడు

చాక్లెట్లు, పానీపూరి ఆశచూపి.. బాలికపై అత్యాచారం

Latest Updates