బిల్ బోర్డ్ పై నీలిచిత్రాలు.. కంగుతిన్న వాహనదారులు

తుంటరి పనులు చేస్తే ఆహ్లదకరంగా ఉండాలి. లేదంటే ఇలా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. అమెరికాలో మిచిగాన్ నేషనల్ హైవైపే 17నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్రసారమయ్యాయి. రహదారిపై వెళుతున్నా వాహనదారులు బిల్ బోర్డ్ పై అడ్వటైజ్మెంట్ ప్రసారం అవుతాయి. కానీ అక్కడ పోర్న్ వీడియోలు ప్రసారం అవ్వడంతో కంగుతిన్నారు. ఈ సంఘటనపై  సమాచారమివ్వడంతో ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు  పోర్న్ వీడియోల్ని నిలిపివేశారు. వీడియోల ప్రసారం పై పోలీసులు విచారణ చేపట్టారు.

బిల్ బోర్డ్ పై నీలిచిత్రాలు ఎలా ప్రసారమయ్యాయని చుట్టు పక్కల ప్రాంతాలను పరిశీలించారు. బిల్ బోర్డ్ కు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరో ఇద్దరు యువకులు కావాలనే బిల్ బోర్డ్ లో పోర్న్ వీడియోల్నిప్రసారం చేసినట్లు పోలీసులు కొన్ని ఆధారాల్ని సేకరించారు. నిందితులు బైక్ పై వెళుతూ బిల్ బోర్డ్ కింద ఉన్న గదిలోకి ప్రవేశించారు. అనంతరం ఆ వీడియోల్ని బిల్ బోర్డ్ లో ప్రసారం అయ్యేలా చేశారు. ఈ తతంగం అంతా వీడియోలు తీశారు. సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియోల ఆధారంగా ఇద్దరు యువకులకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Latest Updates