కరోనాతో సౌదీలో ఇద్దరు తెలంగాణ వాసుల మృతి

హైదరాబాద్: కరోనా రక్కసి కాటుకు సౌదీలో ఉంటున్న ఇద్దరు తెలంగాణ ప్రవాసీయులు చనిపోయారు. అందులో ఒకరిది హైదరాబాద్ లోని బోయిన్ పల్లి స్వస్థలం. సౌదీలోని ఓ మెయింటెన్స్ కంపెనీ లో చాలా ఏళ్లుగా టెక్నీషియన్ గా పని చేస్తున్న ఆ వ్యక్తి శనివారం మృతి చెందాడని ఇండియా ఎంబసీ కన్ఫమ్ చేసింది. మరో కేసులో నిజామాబాద్ కు చెందిన వ్యక్తి చనిపోవడంతో మక్కాలో ఖననం చేశారు. అంత్యక్రియలకు మృతుడి కుటుంబీకులు హాజరు కాకపోవడంతో ఒక ఎన్జీవో యాక్టివిస్ట్ తో దహన సంస్కారలు పూర్తి చేయించారు. వీరితోపాటు కేరళకు చెందిన ఇద్దరు, మహారాష్ట్ర వాసి ఒకరు, ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో వ్యక్తితో సహా సౌదీలో మొత్తం ఎనిమిది మంది ప్రవాసీయులు చనిపోయారని ఇండియా ఎంబసీ ప్రకటించింది.

Latest Updates