సౌధీలో ఘటన : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు మృతి

తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు సౌదీలో మరణించారు. బైక్ పై వెళ్తుండగా ప్రమాధవశాత్తు జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో మంచిర్యాల జిల్లాకు చెందిన వాసులు చనిపోయారు. మృతులు జన్నారం మండలం రోటిగూడెంకు చెందిన ఉప్పు మల్లేశ్(40), దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన రాజు(24)గా గుర్తించారు. ఉపాది కోసం మూడేళ్ల క్రితం రాజు, మల్లేశ్ సౌదీకి వెళ్లారు. రాజు, మల్లేశ్ మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Latest Updates