ఇద్దరు టెర్రరిస్టుల అరెస్ట్

శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ లో ఇద్దరు ట్రెరరిస్టులను సెక్యూరిటీ ఫోర్స్ అరెస్ట్ చేశాయి. త్రాల్, అవంతిపురలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత టెర్రరిస్టు సంస్థలైనా అన్సర్ గజ్వత్ ఉల్ హింద్, హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన వారని భద్రత బలగాలు తెలిపాయి. టెర్రరిస్టులకు షెల్టర్ ఇవ్వటం, వారికి ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లను చేస్తున్నట్లు గుర్తించామన్నారు. కీలకమైన సమాచారాన్ని టెర్రరిస్టులకు చేరవేస్తున్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి పేలుడు పదార్ధాల సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అవంతిపుర పోలీసులు ఎఫ్.ఐ. ఆర్ నమోదు చేసి వీరిని విచారిస్తున్నారు. ఇటీవల హిజ్బుల్ టెర్రరిస్ట్ రియాజ్ నైకూ ను ఎన్ కౌంటర్ లో భద్రత బలగాలు హతమార్చాయి. దీంతో కశ్మీర్ లో ఆందోళనలు మొదలయాయ్యి. నైకూ ఎన్ కౌంటర్ కు రివెంజ్ గా టెర్రరిస్టులు దాడి చేయవచ్చని భద్రత బలగాలు అలర్ట్ గా ఉంటూ టెర్రరిస్టులను పట్టుకునేందుకు ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి.

Latest Updates