కశ్మీర్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నాయి భద్రతా బలగాలు. షోపియాన్ జిల్లాలో ఇద్దరిని హతమార్చాయి. షోపియాన్ జిల్లాలోని అవనీరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే జవాన్లు గాలిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ పూర్తి అయిందన్నారు కశ్మీర్ ఐజీపీ మనీష్. భారీ ఎత్తున ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Latest Updates