జమ్ముకశ్మీర్ లో ఎదురుకాల్పులు: ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రత బలగాలకు నడుమ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. సోఫియాన్ జిల్లా కెల్లర్ ప్రాంతంలో సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలసి సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. మరింత మంది ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో  సైన్యం గాలింపు కొనసాగిస్తోంది.

 

Latest Updates