వాట్సాప్ లో టూ వీలర్ ఇన్సూరెన్స్

Two-wheeler insurance via WhatsApp: Bharti AXA ties up with Wishfin

భారతీ ఏఎక్స్‌‌ఏ జనరల్ ఇన్సూరెన్స్ ఆఫర్

న్యూ ఢిల్లీ : ఇండియాలో ఎక్కువగా వాడుతున్న సోషల్‌ నెట్‌ ‌వర్కిం గ్‌ యాప్‌ వాట్సాప్. దీంతో వాట్సాప్‌ ద్వారానే ఇన్సూరెన్స్‌‌ పాలసీలు అమ్మేద్దా మనుకుంటోంది భారతీ ఏఎక్స్‌‌ఏ జనరల్. వాట్సాప్ ద్వారా టూవీలర్ పాలసీలను విక్రయించనున్నట్టు భారతీ ఏఎక్స్‌‌ఏ  ప్రకటిం చింది. టూవీలర్ కవరేజ్ త్వరగా డెలివరీ చేసేందుకు వెబ్‌‌ అగ్రిగేటర్ విష్‌ఫిన్‌ ఇన్సూరెన్స్‌‌తో చేతులు కలిపింది. భారతీ ఏఎక్స్‌‌ఏ జనరల్ ఇన్సూరెన్స్ భారతీ ఎంటర్‌‌‌‌ప్రైజస్, గ్లోబల్ ఇన్సూరెన్స్ సంస్థ ఏఎక్స్‌‌ఏల జాయిం ట్ వెంచర్. విష్‌ ఫిన్ ఇన్సూరెన్స్ సంస్థ విష్‌ పాలసీ వెబ్‌‌సైట్‌‌లో ఇది పాలసీలను విక్రయిస్తోంది. విష్‌ ఫిన్ ఇన్సూరెన్స్ ద్వారా వాట్సాప్ ప్లాట్‌‌ఫామ్‌ పై భారతీ ఏఎక్స్‌‌ఏ జనరల్ ఇన్సూరెన్స్ అందజేసే టూవీలర్ ఇన్సూరెన్స్‌‌ను కొనుగోలు చేసేలా విష్‌ ఫిన్ సరికొత్త సేవలను లాంచ్ చేసింది.

కంపెనీకి ఇన్సూరెన్స్ పాలసీ అమ్మకానికి బహుళ ఛానళ్లు ఉన్నప్పటికీ, పాలసీ హోల్డర్స్‌‌కు ఇది ఇన్‌స్టాంట్, అదనపు కస్టమర్ సర్వీస్ ఆప్షన్ అని భారతీ ఏఎక్స్‌‌ఏ పేర్కొంది. పెద్ద ఎత్తున బ్రాంచులు,కస్టమర్ కేర్, కాంటాక్ట్ సెంటర్, డైనమిక్ పోర్టల్‌ ,ఇంటెలిజెంట్  ఛాట్‌‌బోట్ వంటివన్నీ కంపెనీకున్నాయి. దేశీయ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో వాట్సాప్ ద్వారా టూవీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేలా అవకాశం కల్పిస్తోన్న తొలి కంపెనీ ఇదే. వాట్సాప్‌ లాంటి మొబైల్ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌‌ఫామ్‌ తో తేలికగా కస్టమర్లు టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీలను పొందేలా చేస్తున్నామని భారతీ ఏఎక్స్‌‌ఏ జనరల్ ఇన్సూరెన్స్  సీఈవో, ఎండీ సంజీవ్ శ్రీనివాసన్ చెప్పారు . భారతీ ఏఎక్స్‌‌ఏ జనరల్ ఇన్సూరెన్స్‌‌ భాగస్వామ్యం తో ‘బై టూవీలర్ ఇన్సూరెన్స్ ఆన్ వాట్సాప్’మరింత పెరగనుందని విష్‌ ఫిన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పురు వశిష్ట చెప్పారు .

Latest Updates