రాష్ట్రంలో భారీగా పెరిగిన టూ వీలర్‌ సేల్స్‌

ఆర్టీఏకు పెరిగిన ఆమ్దానీ

కరోనా టైమ్ లోనూ ఫుల్ ఇన్‌కం

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా టైమ్‌‌లోనూ రాష్ట్ర రవాణా శాఖకు కాసుల పంట పండుతోంది. ఆర్టీఏ ఆదాయం రోజురోజుకూ పుంజుకుంటోంది. రాష్ట్రంలో వెహికల్స్‌‌ సేల్స్‌‌ పెరుగుతున్నాయి. కరోనాతో టూ వీలర్‌‌ కొనుగోళ్లకు ప్రయారిటీ ఇస్తున్నారు.

10వేల స్లాట్స్‌‌ ఓపెన్‌‌..

రాష్ట్ర వ్యాప్తంగా 56 ఆర్టీవో, యూనిట్‌‌ ఆఫీస్‌‌లకు ప్రతిరోజూ వివిధ లైసెన్స్ లు, వెహికల్‌‌ రిజిస్ట్రేషన్‌‌, ఫిట్‌‌నెస్‌‌ సరిఫికెట్లు సహా వివిధ రకాల సేవల కోసం వేల సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం 10వేల స్లాట్స్‌‌ ఓపెన్‌‌లో పెట్టారు. సాధారణ రోజుల్లో 15వేల వరకు స్లాట్స్‌‌ ఓపెన్‌‌ చేస్తారు. సాధారణంగా రవాణా శాఖకు రోజుకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.300 కోట్ల వరకు సమకూరుతుంది. కరోనా ఎఫెక్ట్ తో మేలో రూ.110 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఆ తర్వాత జూన్‌‌లో రూ.240కోట్లు, జులైలో రూ.296కోట్లు, ఆగస్టులో రూ.246 కోట్ల ఆదాయం వచ్చింది. క్యాబ్‌‌, ట్రావెల్స్‌‌ ఓనర్లు క్వార్టర్లీ ట్యాక్స్‌‌ కట్టకపోవడంతో జులైతో కంటే ఆగస్టులో కాస్త తగ్గింది.

పెరిగిన టూవీలర్‌‌ సేల్స్‌‌

కరోనా భయంతో జనం సొంత వెహికల్‌‌లో వెళ్లడానికే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వెహికల్‌‌ సేల్స్‌‌ పెరిగాయి. జులైలో 6,426 కార్లు, 45,377 బైక్‌‌లు రిజిస్టర్‌‌ కాగా.. ఆగస్టులో 56,159 బైక్‌‌లు, 10,621 కార్లు రిజిస్టర్‌‌ కావడం గమనార్హం. ఎక్కువ మంది టూవీలర్‌‌ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

For More News..

ఈఎస్ఐ స్కామ్‌లో మరో రూ.2.29 కోట్లు సీజ్

Latest Updates