ఈ సంవత్సరం తగ్గిన హోండా సేల్స్

ప్రముఖ టూవీలర్ తయారీ ‘హోండా ఇండియా’ సేల్స్ జోరు కొంచెం తగ్గింది. 2018 జూన్‌ అమ్మకాలతో పోలిస్తే 2019 జూన్‌ అమ్మకాలు 16.58 శాతానికి తగ్గాయి. గత సంవత్సరం ఇదే నెలలో 5,71,020 యూనిట్లను అమ్మితే ఈ సంవత్సరం 4,76,364 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

ఇందులో ఇండియాలో 4,50,888 యూనిట్లను అమ్మగా 25,476 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ మధ్యనే టూవీలర్ వాహనాలలో బీఎస్‌ 6 మోడల్‌ ని ఆ కంపెనీ ప్రదర్శించింది. హోండా యాక్టీవా 125బీఎస్‌ 6 మోడల్‌ను వచ్చే ఏడాది మార్కెట్‌ లోకి విడుదల చేయనుంది హోండా ఇండియా.