చెరువులో స్నానానికి వెళ్లి ఇద్దరు మహిళలు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ తాండలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు స‌మీపంలోని చెరువుకు వెళ్లి సరదాగా ఈత కొడుతూ నీట మునిగి ఇద్దరు మహిళలు మృతి చెందారు.వివ‌రాల ప్ర‌కారం.. ఇంట్లో నీళ్లు లేవ‌ని నలుగురు మహిళలు బట్టలు ఉతకడానికి సుల్తానాపూర్ చెరువుకు వెళ్లారు. బట్టలుతికిన అనంతరం సరదాగా చెరువులో స్నానానికి దిగి, నీటిలో మునిగిపోయారు. నలుగురిలో ఇద్దరు చనిపోగా మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు.

మృతి చెందిన వారిలో చిట్టి అలియాస్ అశ్విని, మరో మహిళ వరలక్ష్మి ఉన్నారు. మరో ఇద్దరు మహిళలను (శిల్ప ,జ్యోతి) లను చెరువు పక్కన ఉన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ర‌క్షించారు. ఇద్దరి మృతదేహలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Latest Updates