అత్తాకోడలు దారుణ హత్య.. బంగారం చోరీ

రంగారెడ్డి జిల్లా  మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో దారుణం జరిగింది. రోషన్ కాలనీలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. అత్త, కోడలిని నరికి చంపారు గుర్తు తెలియని దుండగులు. స్థానికంగా నివాసం ఉంటున్న మోహిన్ ఖాన్ భార్య తయ్యభా, తల్లి సబీహా బేగంను హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లతో ఆధారాలు సేకరిస్తున్నారు.

మోహిన్ ఖాన్ కంటే ముందు తయ్యభాను మరో యువకుడు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. అతడ్ని కాదని మోహిన్ ని పెళ్ళి చేసుకోవడంతో .. ఆ యువకుడే హత్యలు చేసి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దుండగులు.. ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారం కూడా ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Latest Updates