ఒక్కని కోసం ఇద్దరు మహిళలు కొట్లాట

చందానగర్, వెలుగు: తన భర్తతో ఓ మహిళచనువుగా ఉంటుందని దాడి చేయగా, ప్రతీకారంగా సదరు మహిళ వాళ్ల అమ్మతో కలిసిదాడి చేసింది. ఈ ఘటన చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చామంతి(25),భర్త బబ్లూతో కలిసి చెత్త కాగితాలు సేకరిస్తూ చందానగర్ లోని గుడిసెల్లో ఉంటుంది.అయితే పటాన్ చెరు ప్రాంతానికి చెందిన చెత్తసేకరించే లక్ష్మి15 రోజుల నుంచి బబ్లూతో చనువుగా ఉండటాన్ని గమనించింది. దీంతో లింగంపల్లి ప్రాంతంలో లక్ష్మిపై దాడి చేసింది. తనపై దాడి చేసిన విషయాన్ని మనసులో పెట్టుకున్న లక్ష్మి తన తల్లి నర్సమ్మతో కలిసి ఈనెల 26వతేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో చందానగర్ కేఫ్ చౌరస్తా వద్ద ఉన్న హర్ష హాస్పిటల్ సమీపంలోని చెట్ల పొదల్లో చామంతి తలపై బండరాయితో బాది గాయపరిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన చామంతిని చూసి స్థానికులు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి,అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతుంది.కేసు నమోదు చేసుకొని ఇద్దరు నిందితులను శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.

 

Latest Updates