పానీ పురీ తినడానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి 

రెండు రోజుల క్రితం పానీపూరి తినివస్తామని ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు యువకుల ఆచూకీ ఇవాళ(గురువారం) లభించింది. జోరుగా వానపడుతున్న సమయంలో వెళ్ళిన ఆ ఇద్దరు తిరిగి ఇంటికి చేరుకోలేకపోయారు. కన్పించకుండా పోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు నగర శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇంజపూర్ వాగులో లభ్యమయ్యాయి. వీరిని తొర్రూరు గ్రామానికి చెందిన ప్రణయ్(19), ప్రదీప్ (16)లుగా పోలీసులు గుర్తించారు.

మంగళవారం సాయంత్రం పక్కనే ఉన్న ఇంజాపూర్‌లో పానీపూరీ తినేందుకు వెళ్తుండగా.. ప్రణయ్, ప్రదీప్ వాగులో కొట్టుకు పోయారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వేలికితీసిన పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Latest Updates