మద్యం మత్తులో అక్టోపస్ పోలీసుల వీరంగం

మద్యం మత్తులో ఆక్టోపస్‌ పోలీసులు ఓ హోటల్లో వీరంగం సృష్టించారు.  హోటల్ లో భోంచేసేందుకు వచ్చిన యువకుడిపై దాడి చేసి గాయపరిచారు. మంగళవారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నం మంగళ్‌పల్లిలోని మన రుచులు అనే రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. గాయాలపాలైన ఆ యువకుడు గురువారం ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఆక్టోపస్‌ విభాగానికి చెందిన సుమారు 15 మంది కానిస్టేబుళ్లు మంగళవారం రాత్రి 11.20 గంటల సమయంలో ఆ హోటల్ కి భోజనం చేసేందుకు వచ్చారని, అదే సమయంలో పక్క టేబుల్‌పై స్నేహితుడితో కలిసి భోజనం తనపై  అకారణంగా దాడి చేశారని బాధితుడు తన ఫిర్యాదులో తెలిపాడు. తనపై దాడి చేస్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేసిన తన స్నేహితుడు కృష్ణపై కూడా దాడి చేశారని తెలిపాడు. తాము పోలీసులమని..ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates