చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

కృష్ణాజిల్లా గన్నవరం కోనాయి చెరువులో ప్రమాదవశాత్తు పడిని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృత దేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను  ప్రకాశం జిల్లా సింగరాయి కొండ, కావలి కి చెందిన షేక్ మస్తాన్ భాషా, కరీంబాషా గుర్తించారు. వీళ్లిద్దరూ అన్నదమ్ముల పిల్లలుగా గుర్తించారు. మస్తాన్ బాషా పాలిటెక్నీక్ చేస్తుండగా.. కరీం బాషా హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ చదువుతున్నాడు. సెలవులు కావడంతో  గన్నవరంలోని వాళ్ల బాబాయి ఇంటికి వచ్చారని చెప్పారు.

Latest Updates