డ్యామ్ తెగింది.. జనాన్ని బలి తీసుకుంది

typhoon-lekima-landslide-wenzhou-eastern-china215434

చైనాలో టైఫూన్ లెకిమా ఎఫెక్ట్

తూర్పుచైనాలో తుఫాను బీభత్సం సృష్టించింది. జెజియాంగ్ ఏరియాలో లెకిమా టైఫూన్ భీకరమైన ప్రభావం చూపించింది. కొండచరియలు విరిగిపడటంతో.. కింది ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో.. కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

వెంజౌ తీరప్రాంతంలో 16 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. దీంతో.. ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన ఓ డ్యామ్ తెగిపోయింది. దీంతో… కొండచరియలు విరిగిపడ్డాయి.

శనివారం నుంచి టైఫూన్ లెకిమా ప్రభావంతో జనం తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. వేలాదిమందిని సురక్షిత శిబిరాలకు తరలించారు. గంటకు 190కిలోమీటర్ల వేగంతో వీచిన అత్యంత బలమైన గాలులకు ఇళ్లు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగపడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది.

తుఫాను గాలులతో ఈస్టర్న్ చైనాలో వేల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేశారు. షాంఘైలోని పలు ప్రధాన ఎయిర్ పోర్టులపైనా ప్రభావం కనిపించింది.

షండాంగ్ ప్రావిన్స్ లోని జినాన్ లో 200 ట్రెయిన్లు రద్దుచేశారు.

తీర ప్రాంతాలైన షాంఘైలో 2లక్షల 50వేల మంది, జెజియాంగ్ లో 8లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు పంపించారు. స్టేడియాల్లో షెల్టర్ ఇచ్చారు.

తుఫాను ధాటికి జెజియాంగ్ లో 200 ఇళ్లు కూలిపోయాయి. 1లక్షా 63వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

Latest Updates