అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోడీ

అబుదాబి: UAE లో ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. దేశాల అధ్యక్షులు, ప్రధానులు, దేశాధినేతలు, రాజులకు బహూకరించే అవార్డుకు ఎంపికయ్యారు మోడీ. ఈ క్రమంలోనే శనివారం UAE యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ .. మోడీని ‘ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’ మెడల్‌ తో సత్కరించారు. ఇది UAE లోనే అత్యున్నత పౌర పురస్కారమని తెలిపారు యువరాజు.

ఇండియా- UAEల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా మోడీ చేసిన కృషికి గానూ ఈ అవార్డును అందజేశామని తెలిపారు. ఇంతకుముందు ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌, సాదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ తదితరులు అందుకున్నారు.

Latest Updates