UAE చరిత్రలో ఫస్ట్ టైం : హిందూ–ముస్లిం దంపతుల పాపకు బర్త్ సర్టిఫికెట్

ఇండియా దంపతుల కో సం మొట్టమొదటి సారి దుబాయ్ చట్టాలను పక్కనబెట్టింది. హిందూ–ముస్లిం దంపతులకు పుట్టిన తొమ్మిది నెలల పాపకు బర్త్​ సర్టిఫికెట్​ ఇచ్చిం ది. యూఏఈ విదేశీయులకు పెళ్లి నిబంధనలను పెట్టింది. దాని ప్రకారం ఓ ముస్లిం పురుషుడు వేరే మతం అ మ్మాయి ని పెళ్లి చేసుకో వచ్చు. కానీ, ముస్లిం అమ్మాయి మాత్రం వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకో కూడదు. అయితే, కిరణ్ బాబు అనే హిందువు, సనమ్ సబూ సిద్దిఖీ అనే ముస్లిం దంపతుల విషయంలో మాత్రం ఆ రూ ల్స్ ను పట్టించుకో లేదు. 2016లో కేరళలో పెళ్లి చేసుకున్నారు కిరణ్, సనమ్.

2018 జూలైలో షార్జా లోని ఆస్పత్రిలో పాప పుట్టిందని, అప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయని కిరణ్ చెప్పారు. షార్జా లోని కోర్టులో నో ఆ బ్జెక్షన్ సర్టిఫికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్నామని, నాలుగు నెలల పాటు విచారించిన కోర్టు తాను హిందువును అన్న కారణంగా బర్త్​ సర్టిఫికెట్​ను తిరస్కరించిందని చెప్పారు. ఈ విషయంలో ఇండియన్ ఎంబసీ ఇచ్చిన ఎంతో సహకరించిందని ఏప్రిల్​ 14న తన కూతురికి యూఏఈ  ప్రభుత్వం బర్త్​ సర్టిఫికెట్​ ఇచ్చిందని, ఇలా రూల్స్ మార్చి సర్టిఫికెట్ ఇవ్వడం ఇదే తొలిసారంటూ అధికారులు చెప్పారని అన్నా రు.

Latest Updates