పబ్జీ ఆడొదన్నాడు..విడాకులిప్పించండి

పబ్​జీ పిచ్చి ఎంతలా ముదిరిపోతోందో చెప్పే ఘటనలు ఇటీవలి కాలంలో బయటకొస్తున్నాయి. పెళ్లి అవుతున్నా ఎవరినీ పట్టించుకోకుండా పబ్​జీ ఆడుకున్న పెళ్లికొడుకు కథ చదివాం. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. కాకపోతే అక్కడ పెళ్లి.. ఇక్కడ పెటాకులు అంతే తేడా. పబ్​జీ ఆడొద్దు అన్న పాపానికి భర్తకు విడాకులిచ్చేయడానికి రెడీ అయిందో భార్య. ఈ ఘటన యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​లో జరిగింది. పాపం భార్య ఎక్కడ ఆ గేమ్​కు బానిసైపోతుందోనని భయపడిన ఆ భర్తను రివర్స్​లో భయపెట్టేసింది ఆ భార్యామణి. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి తన హక్కులను కాలరాస్తున్నాడని గగ్గోలు పెట్టింది. గేమ్​ ఆడుకోవడం తన హక్కు అని, ఆడకుండా భర్త అడ్డుపడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బయటి వాళ్లకు తన స్టేటస్​ తెలియకుండా చాట్​ ఆప్షన్​ను ఆఫ్​ చేసి ఫ్రెండ్స్​, కుటుంబ సభ్యులతోనే గేమ్​ ఆడుతున్నానని వాపోయింది. కానీ, ఆడనివ్వకుండా తన ప్రాథమిక హక్కులకు భర్త భంగం కలిగించాడని మొరపెట్టుకుంది. విడాకులిప్పించాలని వేడుకుంది. అయితే, భర్తను పోలీస్​స్టేషన్​కు పిలిపించిన పోలీసుల.. అతడి వివరణనూ తీసుకున్నారు. అయ్యబాబోయ్​ దీంతో హక్కులకు సంబంధం లేదండి అన్నాడా భర్త. ఎక్కడ గేమ్​కు అడిక్ట్​ అయ్యి, ఇంటి బాధ్యతలను గాలికొదిలేస్తుందోనన్న భయంతోనే ఆడొద్దని చెప్పానని తన గోడు చెప్పుకున్నాడు. కుటుంబాన్ని మంచిగ ఉంచడం కోసమే అలా చేశానన్నాడు. కానీ, ఇలా తన భార్య విడాకులు అడుగుతుందనుకోలేదన్నాడు. అయినా కూడా తనకు విడాకులే కావాలని మొండి పట్టు పడుతోంది ఆ భార్య. మరి, ఈ కథ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూద్దాం.

 

Latest Updates