ఉబర్ నుంచి హెలికాప్టర్ సర్వీసులు

uber-air-makes-its-debut-in-new-york

ప్రస్తుత మార్కెట్లో ఎంత పోటీ ఉందో అందరికీ తెలుసు. ఏ రంగంలోనైనా పెరుగుతున్న పోటీకి తట్టుకుని నిలబడాలంటే తెలివినే పెట్టుబడిగా పెట్టాలి. విన్నూతంగా ఆలోచించాలి. మనుషుల ఆలోచనలకు తగ్గట్లుగా ముందుకెళ్లాలి.  ఉబర్ టెక్నాలజీని సొమ్ము చేసుకుని ఇలాగే దూసుకెళ్తుంది. ఇప్పటికే ఉబర్ ట్యాక్సీ సర్వీస్ అందిస్తున్న ఈ సంస్థ లేటెస్ట్ గా ఉబర్ ఎయిర్ సర్వీసులను స్టార్ట్ చేసింది. వీటి ద్వారా ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు. తక్కువ ఛార్జీలతో హెలికాప్లర్లో వెళ్లవచ్చని ఉబెర్ చెబుతుంది.

ప్రస్తుతానికి అమెరికాలోని న్యూయార్క్ లోని మాన్ హట్టన్  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి జాన్ ఎఫ్. కెనడి ఎయిర్ పోర్ట్ వరకూ ఈ సర్వీసులను అందిస్తున్నట్లు ప్రకటించింది ఈ సంస్థ. అయితే ఉబర్ డైమండ్, ప్లాటినం కస్లమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే అందరికీ అందుబాటులో తీసుకువస్తామని చెప్పారు కంపెనీ ప్రతినిధులు. ప్రస్తుతం 8 నుంచి 10 సర్వీసులను నడుపుతున్న ఉబెర్ సంస్థ 8 నిముషాల జర్నీకి రూ.15 వేలు తీసుకుంటుంది. ఒక్కో హెలికాప్టర్ లో ఐదుగురు జర్నీ చేసేలా ఏర్పాట్లు చేశారు.