తుది దశలో ఉబర్‌‌ ఈట్స్‌‌, జొమాటో డీల్‌ !

న్యూఢిల్లీ : ఆన్‌‌లైన్‌‌ ఫుడ్‌‌ డెలివరీ రంగంలో భారీ మార్పులు రానున్నాయా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రంగంలోని ఉబర్‌‌ ఈట్స్‌‌ను జొమాటో కొనడానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో నే ఇది పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఉబర్‌‌ ఈట్స్‌‌ విలువను రూ. 2,839 కోట్లు (400మిలియన్‌‌ డాలర్లు)గా లెక్కకడుతున్నట్లు తెలుస్తోంది. డీల్‌‌ కుదిరితే జొమాటోలో 150 నుంచి 200 మిలియన్‌‌ డాలర్లను ఉబర్‌‌ ఈట్స్‌‌ పెట్టు బడిగా పెడుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి . తాజాగా మరో 600 మిలియన్‌‌ డాలర్లు నిధులు సమీకరించాలనుకుంటున్నట్లు జొమాటో చెప్పింది.

Latest Updates