నడిచేందుకు తోడు కావాలా.. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.. కానీ

మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నడిచి వెళ్లేందుకు బోర్ గా ఫీలవుతున్నారా..? అయితే మీతో నడిచేందుకు యువతీ కానీ యువకుడు కానీ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలస్యం ఊబర్ బుక్ చేసుకోండి అనే ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇన్నిరోజులు క్యాబ్, ఫుడ్ డెలివరీ చేసే ఊబర్ తాజాగా సరదాగా నడిచేందుకు పార్ట్ నర్ ను వెతికిపెడుతోంది. ఓ నెటిజన్ ఊబర్ “వాకింగ్ బడ్డీ” అనే ఆప్షన్ ఉన్న స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఆప్షన్ కొంతమంది నెటిజన్లు ఊబర్ యాప్ ను అప్ డేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే, మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

స్క్రీన్ షాట్ లో ఉన్న ఆఫర్ ఆధారంగా ఊబర్ వినియోగదారులు బైక్, క్యాబ్ వద్దనుకుంటే నడిచివెళ్లేలా  “వాకింగ్ బడ్డీ” ఆప్షన్ సెలక్ట్ చేసుకోవచ్చు. సెలక్ట్ చేసుకున్న అనంతరం ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.533 చెల్లిస్తే  ఆమెతో కానీ, అతనితో కానీ ఎంతదూరమైనే నడిచే అవకాశం లభిస్తుంది.

అయితే ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఊబర్ స్పందించింది. ఇప్పటి వరకు తాము ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకురాలేదని, భవిష్యత్ లో కష్టమర్లకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఊబర్ తెలిపింది.

Latest Updates