శ్రీమంజునాథ నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత

కన్నడ సినీ పరిశ్రమలో ప్రఖ్యాత నిర్మాత నారా జయశ్రీదేవి ఈ ఉదయం కన్నుమూశారు. ఉదయం 9 గంటల సమయంలో.. అపోలో హాస్పిటల్ లో ఆమె తుదిశ్వాస విడిచారు. జయశ్రీదేవి భౌతిక కాయాన్ని సాయంత్రం బెంగళూరుకు తీసుకెళ్తారని.. గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తారని సన్నిహితులు చెప్పారు.

నారా జయశ్రీదేవి కన్నడలో 25 సినిమాలు చేశారు. రాఘవేంద్రరావు, అర్జున్, చిరంజీవి, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన శ్రీ మంజునాథ సినిమా కన్నడలోనూ, తెలుగులోను మంచి పేరు తెచ్చుకుంది.

నిషద్ద, నమ్మురా మందార హువే, హబ్బా, అమృతవర్షిణి, ముకుందా మురారి లాంటి విజయవంతమైన సినిమాలను ఆమె నిర్మించారు. జయశ్రీదేవి మృతి కన్నడ చిత్రసీమకు తీరని లోటు అని సినీ ప్రముఖులు చెప్పారు.

Latest Updates