నీలాగా తండ్రి పవర్ తో నేను ముఖ్యమంత్రి కాలేదు : కంగన

మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మరియు కంగన రనౌత మధ్య మాటల యుద్ధం  మరోసారి తెరపైకి వచ్చింది. పేరు పెట్టకుండా ఇక్కడికి జీవనోపాధి కోసం వచ్చే కొందరు ముంబై నగరాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పోల్చారని, వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారని ఉద్ధవ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.  తాను తిరిగి పీఓకేను భారత్ లోకి తీసుకువస్తామని ఠాక్రే అన్నారు.  ముంబైలో మాదకద్రవ్యాల బానిసలు ఉన్నారు. మా ఇంట్లో వారికి తెలియదు తులసి..గంజా (గంజాయి) కాదు అని. మన మహారాష్ట్రలోనే  కాదు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసంటూ కంగనాను ఉద్దేశించి అన్నారు.

ఠాక్రే వ్యాఖ్యలపై కంగన మండిపడింది. వారసత్వంతో అధికారంలోకి వచ్చారంటూ సీఎం..,నీలాగా తండ్రి పవర్ ని అడ్డంపెట్టుకుని అధికారంలోకి  రాలేదు.. నేను కూడా గొప్ప కుటుంబానికి చెందినదాన్నే.. వాళ్ల సంపదపై  ఆధారపడి జీవించాలనుకుంటే.. అక్కడే  ఉండేదాన్ని అని అన్నారు.

హిమాలయాల అందం ప్రతి భారతీయుడికి ఎలా చెందుతాయో, ముంబై అందించే అవకాశాలు కూడా ప్రతి ఒక్కరికి చెందుతాయంటూ కౌంటరిచ్చారు.  సీఎం స్థానంలో ఉండి  దసరా రోజున ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసి మొత్తం రాష్ట్రం పరువు తీశారంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.

Latest Updates