మోడీజీ సహాయం చేయండి: ప్రధానికి ఉద్ధవ్ ఠాక్రే వినతి

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే  ప్రధాని మోడీకి కాల్ చేశారు. మహారాష్ట్రలోని రాజకీయ పరిస్థితులలో జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే ఠాక్రే గత ఏడాది నవంబర్ 27న సీఎం గా బాధ్యతలు చేపట్టారు. చట్టసభలలో ఉద్ధవ్ ప్రతినిధి కాకపోయినా.. కూటమి తరపున ముఖ్యమంత్రి అయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 నిబందనల ప్రకారం చట్టసభలో మెంబర్ కాకుండా ముఖ్య మంత్రి అయిన వ్యక్తి…  ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నిక కావల్సి ఉంది. మే 27లోగా ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతె ముఖ్యమంత్రి పదవికి రాజీనాయా చేయాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ వలన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో ఇక మిగిలింది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక అవడమే.. కానీ గవర్నర్ తన నిర్ణయాన్ని వాయిదా వేశారు.

ఇది వరకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో క్యాబినెట్ గవర్నర్ ను కలిసి ఉద్ధవ్ ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేయాల్సిందిగా కోరారు. అయితే తన నిర్ణయాన్ని వారం తరువాత చెప్తానన్నారు గవర్నర్. దీంతో మహారాష్ట్రలో రాజకీయ అస్థిరత ఏర్పడనుందని ఇందుకు ప్రధాని మోడీ కల్పించుకోవాలని ఉద్దవ్ కోరారు.

Latest Updates