బీజేపీకే దూరం  హిందు కి కాదు: ఉద్ధవ్​ థాకరే

  •                  రామ మందిరానికి రూ.కోటి సాయం
  •                  మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​థాకరే
  •                  అయోధ్యను సందర్శించిన శివసేన చీఫ్

జీపీకి దూరమయ్యానుగాని హిందుత్వానికి మాత్రం దూరంకాలేదని మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాకరే  కీలక కామెంట్స్​  చేశారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన శనివారం అయోధ్య వచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం  నిర్మాణానికి కోటి రూపాయలు సాయం చేస్తున్నట్టు   ప్రకటించారు. “బీజేపీ నుంచే నేను దూరమయ్యానుకాని హిందుత్వ నుంచి కాదు.  బీజేపీ, హిందుత్వ వేర్వేరు. హిందుత్వ నుంచి  నేను దూరంకాలేదు”అని  ఆయన చెప్పారు. ఏడాదిన్నరలో అయోధ్యకు తాను మూడుసార్లు వచ్చానని, ఎప్పుడొచ్చినా  ఏదో ఒక గుడ్​న్యూస్​ వినేవాడినని ఉద్ధవ్​ తెలిపారు. “యోగి ఆదిత్యనాథ్​తో నిన్ననే మాట్లాడాను. ఆయోధ్యలో రామమందిరం కోసం  సాయం అందించడానికి రామభక్తులకు అవకాశం కల్పించాలని  ఆయనను కోరాను.  టెంపుల్​ కోసం నేను  కోటి రూపాయలు ఇస్తాను” అని  మహారాష్ట్ర సీఎం చెప్పారు.  అయోధ్యలోని  రామ్​లల్లా దగ్గర ఉన్న తాత్కాలిక గుడిని  కూడా  ఆయన దర్శించుకున్నారు. కరోనా వైరస్​  కంట్రోల్​లో భాగంగా సాయంత్రం సరయూనది దగ్గర జరగాల్సిన హారతి కార్యక్రమం రద్దయింది. దీంతో మహారాష్ట్ర సీఎం దానికి హాజరు కాలేకపోయారు.  పోయిన ఏడాది  నవంబర్​ 28న   ఉద్ధవ్​ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా  ప్రమాణస్వీకారం చేశారు. సిద్ధాంత పరంగా తేడాలున్న కాంగ్రెస్​, ఎన్సీపీ తో  శివసేన పొత్తుపెట్టుకుని అధికారంలోనికి వచ్చింది.

ముగ్గురు హిందూ మతపెద్దల హౌస్​ అరెస్టు

మహారాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసన తెలియజేయాలనుకున్న  ముగ్గురు హిందూ మతపెద్దల్ని పోలీసులు  ముందస్తుగా హౌస్​ అరెస్ట్​చేశారు.  రామ్​లల్లా దగ్గరకు వస్తారన్న సమాచారం  తెలియడంతో అక్కడ ఉద్ధవ్​కు నల్ల జెండాలతో నిరసన తెలపాని వాళ్లు నిర్ణయించుకున్నారు.  రాముడ్ని  కించపరుస్తూ కామెంట్​ చేసినవాళ్లతో కలిసి శివసేన సర్కార్​ ఏర్పాటుచేసినందుకే నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్టు వాళ్లు   తెలిపారు.  సమాచారం తెలిసిన వెంటనే  పోలీసులు… మహంత్​ రాజు దాస్​ (హనుమాన్​ టెంపుల్),  మహంత్​ పరమహంస దాస్​ (తపస్వి ఛావ్ని టెంపుల్​), రాకేశ్​ దత్తు మిశ్రా ( హిందూమహాసభ ప్రెసిడెంట్​) ఇళ్ల దగ్గర పోలీసు ఫోర్స్​ పెట్టి వాళ్లను బయటకు రాకుండా చేసినట్టు అయోధ్య  సీనియర్​ ఎస్పీ ఆశిష్​ తివారీ చెప్పారు.​

Latest Updates